ఖర్మ కాలితే ఎవరు మాత్రం ఎం చేస్తారు…? ఎవరు చేసేది ఏమీ ఉండదు. ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. ఒక జడ్జి కి సహా పోలీసు సిబ్బందికి ఇదే జరిగింది. విధులు నిర్వహించిన పాపానికి వాళ్ళు ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నారు. అసలు ఎం జరిగిందో ఈ స్టోరీలో చూద్దాం. ఆ దొంగ వాహనాలతో పాటుగా ఇతర వస్తువులను దొంగతనం చేస్తూ ఉంటాడు. దీనితో అతని కోసం కొన్ని రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు.
ఈ నెల ఆరున అతన్ని పట్టుకున్న పోలీసులు ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకుని కోర్ట్ లో హాజరు పరిచారు. జడ్జి అతనికి రిమాండ్ విధించారు. ఆ నిందితుడు నాలుగు రోజులుగా అనారోగ్యానికి గురయ్యాడు. అతనిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీనితో జాగ్రత్త పడిన పోలీసులు వెంటనే జాగ్రత్తగా కరోనా టెస్ట్ లు చేయించారు. అతనికి కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలడం తో షాక్ అయ్యారు.
పంజాబ్‌లోని లూథియానలో జరిగిన ఈ సంఘటన అందరిని ఆందోళనకు గురి చేసింది. పంజాబ్ వైద్య ఆరోగ్య శాఖ జాగ్రత్త పడింది. దొంగను పట్టుకున్న పోలీసులను, ఇతర సిబ్బందిని వెంటనే క్వారంటైన్ కి తరలించారు. ఇక జడ్జి సైతం క్వారంటైన్ కి వెళ్ళారు. వారు కచ్చితంగా క్వారంటైన్ లో ఉండాలి అని అధికారులు పేర్కొన్నారు. ఆ దొంగ వయసు 24 ఏళ్ళు కాగా పంజాబ్ నుంచి అతను రాజస్థాన్ లోని జైపూర్ కి వెళ్ళాడు. అక్కడ అతనికి వ్యాధి సోకింది అని భావిస్తున్నారు.