వినియోగదారులంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న జియో గిగాఫైబర్ సేవలు ఎట్టకేలకు గురువారం ప్రారంభమయ్యాయి. ముందుగా అనుకున్నట్టుగానే సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈ సేవలు ప్రారంభమవుతాయి. ఇక గిగా ఫైబర్ ప్లాన్లు కూడా ఈ రోజు వెల్లడించారు. ప్రస్తుతం జియో గిగాఫైబర్‌లో 6 ప్రీపెయడ్ ప్లాన్లను అందుబాటులో ఉంచారు. బ్రాంజ్ కేటగిరిలో నెలకు రూ.699కు, సిల్వర్ విభాగంలో నెలకు రూ.849కు, గోల్డ్‌లో రూ.1299కు, డైమండ్ విభాగంలో నెలకు రూ.2499కు, ప్లాటినంలో రూ.3999కు, టైటానియం విభాగంలో నెలకు రూ.8499కు మొత్తం 6 ప్లాన్లను అందిస్తున్నారు.
– ఈ ప్లాన్లలో నెట్ డీటైల్స్ చూస్తే బ్రాంజ్, సిల్వర్ ప్లాన్లలో 100 ఎంబీపీఎస్ గరిష్ట ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది.
– గోల్డ్, డైమండ్‌లలో 250, 500 ఎంబీపీఎస్ స్పీడ్ ఉంటుంది.
– ప్లాటినం, టైటానియం ప్లాన్లలో గరిష్టంగా 1జీబీపీఎస్ వరకు ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది.
– వీటితోపాటు 3, 6, 12 నెలల వాలిడిటీ ఉన్న ప్లాన్లు కూడా ఉంటాయి.
– బ్రాంజ్ ప్లాన్‌లో కస్టమర్లకు నెలకు 100జీబీ ఉచిత డేటా లభిస్తుంది. దీంతోపాటు లాంచింగ్ సందర్భంగా మరో 50 జీబీ డేటాను అదనంగా అందిస్తున్నారు.
– సిల్వర్ ప్లాన్‌లో 200 జీబీ నెలవారీ డేటా, 200 జీబీ అదనపు డేటా ఉంటుంది.
– గోల్డ్ ప్లాన్‌లో 500 జీబీ+250 జీబీ డేటా, డైమండ్ ప్లాన్‌లో 1250 జీబీ + 250 జీబీ డేటా ఉంటుంది.
– ప్లాటినం ప్లాన్‌లో 2500 జీబీ డేటా లభిస్తుంది.
– టైటానియం ప్లాన్‌లో 5000 జీబీ నెలవారీ డేటా లభిస్తుంది. ఇక ఈ ప్లాన్లు అన్నింటిలోనూ ఇచ్చే డేటా అంతా అయిపోయాక ఇంటర్నెట్ స్పీడ్ 1 ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. 30 రోజులు కాగానే బిల్ సైకిల్ మారి, స్పీడ్, డేటాలు యథావిధిగా లభిస్తాయి.
– దేశంలో ఎక్కడికైనా ఉచిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.
– అన్ని ప్లాన్లలోనూ ఏడాదికి రూ.1200 విలువ గల ఉచిత టీవీ వీడియో కాలింగ్‌ను, మరో రూ.1200 విలువైన గేమింగ్ సదుపాయాన్ని, హోం నెట్‌వర్కింగ్, డివైస్ సెక్యూరిటీ (5 డివైస్‌లకు) సదుపాయాలను అందిస్తున్నారు.
– డైమండ్, ప్లాటినం, టైటానియం ప్లాన్లలో అదనంగా వీఆర్ ఎక్స్‌పీరియెన్స్, ప్రీమియం కంటెంట్ (ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీలు, స్పెషల్ స్పోర్ట్స్ కంటెంట్)ను అందిస్తున్నారు.
– జియో గిగాఫైబర్ సేవలకు గాను వార్షిక ప్లాన్‌ను ఒకేసారి తీసుకునే వారికి వెల్కం ఆఫర్ కింద రూ.5వేల విలువైన జియో హోం గేట్‌వే, రూ.6400 విలువైన జియో 4కె సెట్ టాప్ బాక్స్‌లను ఉచితంగా అందిస్తున్నారు.