జియో యూజర్లకు బిగ్‌ షాక్‌..రూ.100 పెంపు !

-

 

జియో యూజర్లకు భారీ షాక్ తగిలింది. పోస్ట్ పెయిడ్ యూజర్లకు రిలయన్స్ జియో భారీ షాకిచ్చింది. రూ.199 ప్లాన్‌పై రూ.100 పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాన్‌పై రూ.299 వసూలు చేయనున్నట్టు తెలిపింది.

Reliance Jio has given a huge shock to postpaid users It has announced an increase of Rs.100 on the Rs.199 plan

పెంచిన ధరలు ఈనెల 23 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్న జియో.. ప్రస్తుతం ఈ ప్లాన్‌లో ఉన్న కస్టమర్లు ఆటోమేటిక్‌గా రూ.299కు బదిలీ అవుతారని పేర్కొంది. అన్ని నెట్‌వర్క్‌లు ప్రీ పెయిడ్ చార్జీలను ఇటీవలే పెంచిన సంగతి తెలిసిందే. ఇక రూ.199 ప్లాన్‌పై రూ.100 పెంచుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో పోస్ట్ పెయిడ్ యూజర్లు షాక్ అవుతున్నారు. వెంటనే వేరే సిమ్ తీసుకోవాలని కూడా కొందరు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news