తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి దరఖాస్తుల స్వీకరణకు మరో అవకాశం కల్పించింది రేవంత్ రెడ్డి సర్కార్. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు ఇవాల్టి నుంచి దరఖాస్తులు చేసుకునేందుకు మరొక అవకాశం కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ కార్డులు అలాగే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితా ఆయా గ్రామాలకు చేరిందని చెబుతున్నారు అధికారులు.
తమ పేర్లు రాలేదని కొందరు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో వారికి అవకాశం ఇవ్వాలని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అలాంటి వారి నుంచి గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు రావడం జరిగింది. దీంతో ఇవాల్టి నుంచి దరఖాస్తుల స్వీకరణ… జరగనుంది.