శరీరం మీద రోమాలను తొలగించడానికి ఇంట్లో తయారు చేసుకోగలిగే స్క్రబ్

-

శరీరం మీద అంతటా రోమాలు ఉంటాయి. కాకపోతే బయటకి కనిపించే భాగాల్లో ఎక్కువగా ఉండే రోమాలు చికాకు కలిగిస్తుంటాయి. దీనికోసం బ్యూటీ పార్లర్లకి వెళ్ళడం మామూలే. శరీర భాగాల్లోని రోమాలను తొలగించడానికి బ్యూటీ పార్లర్లలో అనేక పద్దతులు ఉన్నాయి. ఐతే మహమ్మారి సమయం కాబట్టి, బ్యూటీ పార్లర్ కి వెళ్ళడానికి సంకోచాలు అడ్డు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఇంట్లోనే ఉండి రోమాలను తొలగించుకునే స్క్రబ్ తయారు చేసుకోండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐతే చాలామంది దీనికోసం మెడిసిన్స్ వాడుతుంటారు. దాని వల్ల కూడా ప్రయోజనం ఉన్నప్పటికీ సహజసిద్ధమైన వాటిని వాడడం అటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అందుకే స్క్రబ్ తయారీ గురించి తెలుసుకోండి.

ఈ స్క్రబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు

చక్కెర- 3టేబుల్ స్పూన్లు
నిమ్మరసం- 2టేబుల్ స్పూన్లు
ఎర్రపప్పు- 5టేబుల్ స్పూన్లు
బంగాళ దుంప రసం- 5టేబుల్ స్పూన్లు

తయారీ పద్దతి

ఈ పదార్థాలన్నింటినీ తీసుకుని మిశ్రమం మాదిరిలా తయారు చేసి పేస్టులాగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఈ పేస్టుని శరీరంలోని ఏయే భాగాలు ఎక్కువ ప్రభావితం అయ్యాయో ఆ ప్రాంతాల్లో అప్లై చేయాలి. పూర్తిగా పొడిబారిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ప్రతీరోజూ ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల తయారైన పదార్థంలోని గరుకు దనం, రోమాలను ఊడిపోయేలా చేస్తుంది. బంగాళదుంపలోని పోషకాలు రోమాలను తీసివేయడంలో ఉపయోగపడతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version