*ఆంధ్రా గోల్ద్, సిల్వర్ స్ట్రైప్స్, 9సీ హార్స్ మద్యం బ్రాండ్లు ఏపీలో ఎందుకు అమ్మడం లేదు – అనిత

-

ప్రభుత్వం సరఫరా చేసే మద్యం బ్రాండ్లల్లో విషం లేదని చెప్పే దమ్ము ప్రభుత్వానికి లేక మాపై విషప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు వంగలపూడి అనిత. ఆంధ్రా గోల్ద్, సిల్వర్ స్ట్రైప్స్, 9సీ హార్స్ మద్యం బ్రాండ్ లు ఇప్పుడెందుకు ప్రభుత్వ దుకాణాల్లో కనిపించట్లేదని నిలదీశారు.

తెలుగుదేశం ఆధారాలు బయటపెట్టాకే ఇవి కనిపించకుండా పోవటం వెనక ఆంతర్యం ఏంటీ..?అని ప్రశ్నించారు. ఆయా బ్రాండ్లల్లో విషం ఉందని ప్రభుత్వం పరోక్షంగా ఒప్పుకుంది…విషాన్ని కూడా బంపర్ ఆఫర్లో ప్రజలకు అమ్మిన ప్రభుత్వం ఇదన్నారు.

ప్రజలకు విషం పోస్తూ మేం విషం కక్కుతున్నామని సజ్జల చెప్పటం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. డబ్బులిచ్చి విషాన్ని కొనుక్కుని ప్రాణాలు తీసుకునే దౌర్భాగ్యం ఏపీలోనే ఉంది..ఏపీలో అమ్ముతున్న మద్యం బ్రాండ్లు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమ్మట్లేదు అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 100 డిస్టలరీలు రిజిస్టర్ అయితే కేవలం 16కు మాత్రమే అనుమతులిచ్చినట్లు ఆర్టీఐ ఇచ్చిన సమాధానానికి ఏం చెప్తారు..? అని ఫైర్ అయ్యారు వంగలపూడి అనిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version