సరోగసి ద్వారా బిడ్డలకు జన్మనిచ్చిన హీరోయిన్స్ వీళ్ళే..!!

-

ఇటీవల కాలంలో చాలామంది హీరోయిన్స్ సరోగసి ద్వారా బిడ్డలకు జన్మనిస్తున్నారు.. ఎవరైనా సరే 9 నెలలు గర్భాన్ని మోసి ఆ తర్వాత పురిటి నొప్పులు భరించి ఎంతో అద్భుతమైన ఒక పిండానికి జీవం పోస్తూ ఉంటారు.. ఇక ఆ మధుర క్షణాలు ఎలా ఉంటాయో అనుభవించిన మహిళలకు తెలుస్తుంది అని అంటారు చాలామంది . కానీ ఇక్కడ చాలామంది హీరోయిన్లు అవేవీ అనుభవించకుండానే డైరెక్ట్ గా పిల్లలను ముద్దాడడం మొదలుపెట్టారు. ఇకపోతే ఇటీవల బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తల్లి అయిందని వార్తలు రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. నిజానికి ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ ఇద్దరూ కూడా సరోగసి ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఇక ఈమెతో పాటు మరి ఎంతోమంది చిత్ర పరిశ్రమలో సరోగసి ద్వారా పిల్లలకు జన్మనివ్వడం జరిగింది.

సన్నీ లియోన్:శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె సరోగసి ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. అంతేకాకుండా ఇంకొక అమ్మాయిని కూడా దత్తత తీసుకుంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

కిరణ్ రావు:బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ రెండవ భార్య కూడా సరోగసి ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు 36 సంవత్సరాలు వయసులో అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఇలా మగ బిడ్డకు జన్మనివ్వడం గమనార్హం.

గౌరీ ఖాన్:బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ షారుక్ ఖాన్ భార్య గౌరీకాన్ కూడా మూడో బిడ్డకు సరోగసి ద్వారా జన్మనిచ్చింది. 40 సంవత్సరాల వయసులో ఆమె బిడ్డకు జన్మనివ్వడం క్షేమం కాదని సరోగసి ద్వారా మగ బిడ్డ అక్బర్ ఖాన్ కు జన్మనిచ్చింది.

మంచు లక్ష్మి:మోహన్ బాబు వారసురాలు మంచు లక్ష్మి కూడా గుజరాత్ కు చెందిన ఒక మహిళ ద్వారా సరోగసి నుంచి ఒక ఆడ బిడ్డను సొంతం చేసుకోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version