దేశంలో మాత్రం పెట్రో దోపిడీ ఆగ‌డం లేదు : కేటీఆర్‌

-

తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. తగ్గిన ముడిచమురు ధరల మేరకు పెట్రో రేట్లు తగ్గించాలని మోదీని డిమాండ్ చేశారు. మోదీ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టి నుంచి పెట్రోల్ ధ‌ర‌లు అమాంతం పెరిగిపోయాయ‌ని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. అంత‌ర్జాతీయంగా ధ‌ర‌లు పెరిగినా, త‌గ్గినా దేశంలో మాత్రం పెట్రో దోపిడీ ఆగ‌డం లేద‌న్నారు. ప్రస్తుతం ముడి చమురు బ్యారల్ ధర 95 డాలర్లకు తగ్గినా, పెట్రో రేట్లను తగ్గించడం లేదని మండిప‌డ్డారు మంత్రి కేటీఆర్.

పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే దేశ ప్రజల నుంచి రూ. 26 లక్షల కోట్లకు పైగా కేంద్రం వసూలు చేసిందని, ఈ పెట్రో పన్నులను ప్రజల నుంచి గుంజి, కార్పోరేట్ల రుణాల మాఫీకి వాడుకుంటున్నద‌ని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. చట్టాన్ని మార్చుకుని మరీ సెస్సులు, సుంకాల పేరుతో భారీగా దోపిడీ చేస్తున్నదని ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. ఆ నెపాన్ని రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా పెట్రోల్ పైన ఒక్క రూపాయి అదనపు పన్ను వేయని తెలంగాణ లాంటి రాష్ట్ర‌ ప్రభుత్వాలపైకి నెడుతున్నద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మంత్రి కేటీఆర్. పెంచిన కొండంత ధరలను నామమాత్రంగా తగ్గించి, పేదల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నదని, ఇది ముమ్మమాటికీ నయవంచనకు పరాకాష్టనే అన్నారు మంత్రి కేటీఆర్. దేశంలో ఏర్పడిన దుర్భర ద్రవ్యోల్బణ పరిస్థితులు, కరోనా సంక్షోభ నేపథ్యంలో పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version