రెంట్‌ నౌ పే లేటర్‌.. డబ్బులు లేకున్నా అద్దె కట్టేయొచ్చు.. ఎలాంటి ఎక్స్‌ట్రా ఛార్జీలు ఉండవు

-

ఇంటి అద్దె సమయానికి కట్టకపోతే.. ఓనర్‌ ఉగ్రరూపం చూపిస్తాడు.. అప్పటివరకు బానే ఉన్న యజమాని..పైసల కోసం పీక్కుతింటాడు. కొంతమంది ఓనర్లు బానే ఉంటారు. కానీ చాలామంది ఓనర్లు కఠినంగా ఉంటారు. కొన్నిసార్లు ఇంట్లో సామాన్లు బయటకు విసిరేస్తారు కూడా.. అసలే ఇప్పుడు చాలామందికి ఉద్యోగాలు పోయి నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి అద్దె కట్టడం అంటే కాస్త కష్టమైన పనే.. ఎవర్ని అయినా అడుగుదాం అంటే.. మనసాక్షి ఒప్పుకోదు.. పెద్ద అమౌంట్‌ అయినా బానే ఉంటుంది. ఇంటి అద్దే అంటే.. పదిపదిహేను వేల లోపలే ఉంటుంది చాలామందికి.. ఇంత చిన్న అమౌంట్‌ అడిగితే.. వీళ్లదగ్గర పైసలు లేవు అని అనుకుంటారేమో అన్న భయం.. ఇలాంటి వారికోసం.. హౌసింగ్‌ యాప్‌ మంచి ఆప్షన్‌ తీసుకొచ్చింది.

హౌసింగ్‌.కామ్‌ వినూత్న ఫైనాన్షియల్‌ ప్రొడక్ట్‌ను భారత విపణికి పరిచయం చేసింది. ‘బై నౌ పే లేటర్‌ (BNPL)’ తరహాలో ‘రెంట్‌ నౌ పే లేటర్‌ (RNPL)’ సేవల్ని ప్రారంభించింది. అందుకోసం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘నీరో’ అనే ఫిన్‌టెక్‌ స్టార్టప్‌తో చేతులు కలిపింది. సమయానికి డబ్బుల్లేని కస్టమర్లు ఆర్ఎన్‌పీఎల్‌ (RNPL) ద్వారా అద్దె చెల్లించేయొచ్చు. అందుకు ఎటువంటి కన్వీనియెన్స్‌ ఫీజు విధించడంలేదు. పైగా నలభై రోజుల వరకు ఈ మొత్తంపై ఎలాంటి వడ్డీ కూడా ఉండదు. అవసరమైతే ఆ మొత్తాన్ని నెలవారీ వాయిదాలు (EMIs)గా కూడా మార్చుకోవచ్చు.

క్రెడిట్‌ కార్డు సదుపాయం లేని లక్షలాది మంది కస్టమర్లకు ఆర్‌ఎన్‌పీఎల్‌ ఉపయోగకరంగా ఉంటుందని హౌసింగ్‌.కామ్‌ సీఈఓ ధ్రువ్‌ అగర్వాల్‌ వెల్లడించారు.. అధికారికంగా ఈ సేవల్ని ప్రారంభించడానికి ముందే ప్రయోగాత్మకంగా దీన్ని పరీక్షించినట్లు అగర్వాల్‌ తెలిపారు. దాదాపు లక్ష మంది యూజర్లు దీన్ని ఉపయోగించుకొని సంతృప్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం ఫోన్‌ పే, పేటీఎం వంటి ఆర్థిక సేవల సంస్థలు రెంట్‌ పే ఆప్షన్‌ను అందిస్తున్నాయి. క్రెడిట్‌ కార్డును ఉపయోగించి వీటి ద్వారా చెల్లింపులు చేయొచ్చు కానీ… ఇందుకు గానూ కొంత ఛార్జీలను అవి వసూలు చేస్తున్నాయి. బ్యాంకులు సైతం 1 శాతం వరకు ఛార్జీలు వేస్తున్నాయి. అయితే, హౌసింగ్‌.కామ్‌ అందిస్తున్న RNPL సదుపాయం ఉపయోగించుకోవడానికి ఎలాంటి క్రెడిట్‌ కార్డూ అవసరం ఉండదు. 40 రోజుల వరకు ఎలాంటి ఛార్జీలూ ఉండవు. ఓ రకంగా ఇదో స్వల్పకాలిక రుణ సదుపాయం లాంటిదే. ఇంకెందుకు ఆలస్యం.. అవసరం అయితే వాడేయండి..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version