ఏపీలో రేణు దేశాయ్…పవన్ కళ్యాణ్‌ పై కీలక వ్యాఖ్యలు !

-

 

తూర్పుగోదావరి పరిధి రాజానగరం మండలం నరేంద్రపురంలో ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ లో ఐదు రకాల కొత్త ఉత్పత్తులను ప్రారంభించారు రేణు దేశాయ్. దక్షిణ భారతదేశ ప్రజలకు ఇడ్లీ, ఉప్మా కంటే మంచి ఆహారం మరొకటి లేదని ఫారెన్ ఆహారాలు కంటే ఆంధ్ర పెసరట్టు చాలా మేలని ఈ సందర్భంగా కితాబు ఇచ్చారు. గోదావరి జిల్లా లాంటి అందమైన లొకేషన్స్ నేను ఎక్కడ చూడలేదని… విజయవాడ నుంచి రాజమండ్రి మధ్య పచ్చని అందాలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదని వివరించారు.

తెలుగు సినిమా పరిశ్రమ ఏపీకి రావాలని పెద్దలు ప్రకటించారని… ఏపీలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందితే నాకు సంతోషం అన్నారు. నాకు చిన్నప్పటి నుంచి మూగజీవాల సంరక్షణ పట్ల ఆసక్తి ఉందని….సామాజిక సేవా కార్యక్రమాల కోసం నా కుమార్తె ఆద్య పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేశానని ప్రకటించారు. అఖిరా సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడా అన్న ఆత్రుత ఉందని తెలిపారు రేణు దేశాయ్. అఖిరా నందన్ సినిమాల్లోకి రావాలని నేనూ కోరుకుంటున్నానని సినీనటి రేణు దేశాయ్ అన్నారు. తల్లిగా అఖిరా నందన్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడని నాకూ ఆత్రుతగా ఉందన్నారు. అకిరా నందన్ ఇష్టంతోనే సినిమాల్లోకి వస్తాడన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version