టీడీపీ మద్దతుతో BRS వాళ్ళను ఇంటికి తరిమేశాం – రేణుకా చౌదరి

-

టీడీపీ పార్టీ మద్దతుతో BRS వాళ్ళను ఇంటికి తరిమేశామంటూ కాంగ్రెస్‌ నాయకురాలు రేణుకా చౌదరి వివాదస్ప వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సభలో మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి మాట్లాడుతూ…నేను ఖమ్మం జిల్లా ఆడబిడ్డను…నాకు కొత్త కొత్త బిరుదులు ఇచ్చి నన్ను ఈ ప్రాంతానికి దూరం చేయొద్దని కోరారు. నన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించిన నేత ఎన్టీఆర్….ఎలాంటి రాజకీయ నేపధ్యం లేని నాలాంటి చాలా మందిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారని కొనియాడారు.

నా పార్టీలో ఉన్న ఏకైక మగాడు రేణుకా అనే వారు….ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా ఇంకా బ్రతికే ఉందంటే అది ఎన్టీఆర్ గారు ఇచ్చిన క్రమశిక్షణా,స్ఫూర్తి ఉంటుందన్నారు. రాజకీయాల్లో కొన్ని మార్పులుండొచ్చు, గోడలు మారొచ్చు కానీ, పునాది మారదని వెల్లడించారు. అందుకే నేను ఇవాళ వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించాను….ముఖ్యమంత్రులుగా చంద్రబాబు, రేవంత్ లు రాణిస్తున్నారు అంటే అది ఎన్టీఆర్ నేర్పిన నైపుణ్యం అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version