ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ సీఎం, విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారకరామారావు వర్ధంతిని (జనవరి 18)న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా ఏపీ మంత్రి నారాలోకేశ్, జూనియర్ ఎన్టీఆర్ సైతం వచ్చి ఆయన ఘాట్‌కు నివాళులు అర్పించారు. కాగా, ఎన్టీఆర్ ఘాట్ మెయింటేన్స్ సరిగా లేకపోవడంపై మంత్రి నారాలోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
తన సహాయక సిబ్బందికి చెప్పి మరమ్మత్తులు నిర్వహించాలని ఆదేశించారు. మరోవైపు ఎన్టీఆర్ ఘాట్‌కు ఎందుకు మరమ్మతులు చేయట్లేదని ఎన్టీఆర్ అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కాస్త ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ప్రభుత్వం నిధులతో ఎన్టీఆర్ ఘాట్‌కు మరమ్మతులు చేయాలని HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.