ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో కొందరు వ్యక్తులు ప్రైవేట్ ఆల్బమ్ షూటింగ్ పేరిట పిచ్చివేషాలు వేసినట్లు తెలుస్తోంది.ప్రైవేట్ ఆల్బమ్ షూటింగ్ పేరిట ఏకంగా గర్భగుడిలోనే సెట్ వేసినట్లు తెలిసింది. దీంతో స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులను ఎక్కడి కక్కడ నిలిపివేసినట్లు సమాచారం.
ఆల్బమ్ షూట్ అయ్యేంత వరకు గుడి తలుపులు మూసివేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై భక్తులు, స్థానికులు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సదరు దేవాదాయ శాఖ అధికారులు స్పందించకపోవడం మరిన్ని విమర్శలకు దారి తీసింది. ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా నడుచుకున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.