దయచేసి విమాన బుకింగ్స్ ని ఓపెన్ చేయండి.. ఈజ్ మై ట్రిప్ కి మాల్దీవ్స్ సంఘం రిక్వెస్ట్..!

-

ప్రధాన నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ అవమానకర వ్యాఖ్యలు చేయడంపై భారతీయులు భగ్గుమన్నారు. లక్షద్వీప్ కి ప్రధాని మోడీ వెళ్లి ఫోటోలని పంచుకున్నారు దీంతో చాలామంది భారతీయ పర్యటకులు మాల్దీవ్స్ యాత్రలనీ రద్దు చేసుకున్నారు. ఇప్పటికే 10 వేల హోటల్ బుకింగ్స్ తో పాటు ఫ్లైట్ టికెట్స్ ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు భారతీయులు ప్రముఖ బుకింగ్ టూరిజం ప్లాట్ ఫామ్ ఈజ్ మై ట్రిప్ మాల్దీవులకి సంబంధించిన ఫ్లైట్ లని రద్దు చేసింది ఈ నిర్ణయం పై మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్స్ ఈజ్ మై ట్రిప్ కి మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యల్ని పట్టించుకోవద్దని రిక్వెస్ట్ చేశారు.

ఇది సాధారణ మాల్దీవ్స్ ప్రజల అభిప్రాయాన్ని ప్రతిపాదించే వ్యాఖ్యలు కాదని అన్నారు కోవిడ్ తర్వాత తమ దేశానికి వచ్చిన టూరిస్ట్ లలో ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారని వారు తమ దేశం ఆర్థిక వ్యవస్థకి దోహదపడ్డారని ఈజ్ మై ట్రిప్ సీఈవో నిశాంత్ ని ఉద్దేశిస్తూ చెప్పారు మాల్దీవులకి ఎక్కువ మంది భారతీయులే వెళ్తుంటారు గత రెండేళ్లలో 4.5 లక్షల మంది దేశానికి వెళ్లారు కరోనా సమయంలో అయితే 63,000 మంది భారతీయులు సందర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news