టిస్‌ ముంబాయిలో రీసెర్చ్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వానికి చెందిన ముంబాయి లోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్ లో పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. రీసెర్చ్‌ అసోసియేట్‌, రీసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. దీనిలో మొత్తం నాలుగు ఖాళీలు వున్నాయి. రీసెర్చ్‌ అసోసియేట్‌, రీసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టులు కి అర్హులైన వాళ్ళు అప్లై చేసుకోచ్చు. ఇక వయస్సు విషయానికి వస్తే.. మార్చి 1,2022 నాటికి అభ్యర్ధుల వయసు 32 ఏళ్లకు మించి వుండకూడదు.

ఇక శాలరీ విషయానికి వస్తే.. రూ.35,000 నుంచి రూ.50,300ల వరకు జీతం ఇస్తారు. ఇక అర్హత వివరాల లోకి వెళితే.. సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదే విధంగా పని లో అనుభవం కూడా ఉండాలి.

ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. మార్చి 7, 2022 దరఖాస్తులకు చివరి తేదీ. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌ లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version