కరోనా అంత ప్రాణాంతకం కాదు: సర్వే

-

మెరుగైన చికిత్స కారణంగా కరోనా వైరస్ ప్రాణాంతకం కావడం లేదని… ప్రాణాల మీదకు వచ్చే ముప్పు ఏప్రిల్ నుండి దాదాపు మూడో వంతు తగ్గిందని యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్‌ఎంఇ) పరిశోధకులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికాలో కరోనా వైరస్ బారిన పడిన వారిలో కేవలం 0.6% మంది మాత్రమే ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇది మహమ్మారి ప్రారంభంలో 0.9% గా ఉంది అని సంస్థ డైరెక్టర్ డాక్టర్ క్రిస్టోఫర్ ముర్రే చెప్పారు. రోగుల సంరక్షణ కోసం వైద్యులు మెరుగైన మార్గాలను కనుగొన్నారని ఆయన వివరించారు. ఆక్సిజన్ సహాయంతో వైద్యం మెరుగు పడింది అని చెప్పారు. వ్యాధి బారిన పడిన చాలా మంది లక్షణాలు లేకుండా ఉండటంతో వారికి కాస్త ఇబ్బంది ఉంది అని వెల్లడించారు. కరోనా కారణంగా యువకుల కంటే వృద్ధులు చనిపోయే ప్రమాదం ఉంది అని ఆయన వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version