మెగాస్టార్ సినిమాలో జ‌బ‌ర్దస్త్ బ్యూటీ ఐట‌మ్ సాంగ్…!

-

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తరవాత వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. అంతే కాకుండా విభిన్న కథలతో చిరు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు . ఇప్పటికే మెగాస్టార్ కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమాను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇదిలా ఉండగా మెగాస్టార్ మెహర్ రమేష్ దర్శకత్వం లో ఓ సినిమాను ప్రారంభించారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర వార్త నెట్టింట చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో జబర్థస్త్ బ్యూటీ రష్మి ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ వార్త నిజమే అయితే రష్మి బంపరాఫర్ కొట్టేసినట్టే… మెగాస్టార్ తో స్టెప్పులు వేయాలంటే అదృష్టం కావాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది మెగాస్టార్ తో లో సీన్ లో కనిపిస్తే చాలనుకుంటారు. అలాంటిది చిరు తో చిందులు అంటే రష్మి లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టు అని ఫిల్మ్ నగర్ లో అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ హాట్ యాంకర్ టివి షోలలో పాటు సినిమాలు కూడా చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అంతే కాకుండా అప్పుడప్పుడు సోషల్ సర్వీస్ కూడా చేస్తూ ప్రశంసలు అందుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version