రేవంత్ రెడ్డికి ఎప్పుడూ డబ్బు కావాలన్నా బడేభాయ్ దగ్గరికీ వెళతాడు : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

-

మోడీ గ్యారెంటీలకు వారంటీ లేదని రేవంత్ రెడ్డి అన్న మాటలకు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పందించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. గ్యారెంటీ ఎప్పుడు కూడా వారంటీ అవ్వదని, రేవంత్ రెడ్డి ఇచ్చిన గ్యారెంటీలకు కూడా వారంటీ లేదని అందుకే ఎప్పటికీ సాధ్యం కాని గాడిద గుడ్డు పట్టుకొని ప్రజల్లో తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన 5-6 గ్యారెంటీల కోసం ఎదురు చూస్తున్నారు కానీ అవి ఎప్పటికీ ఆచరణ సాధ్యం కాదని, ఎందుకంటే రాష్ట్రం దివాళా తీసిందని అన్నారు.

గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల రుణాలు తీసుకుందని, దానిపై ఇప్పడు ఈ ప్రభుత్వం 80 వేల కోట్ల వడ్డీ చెల్లిందని, అలాగే 55-60 వేల కోట్ల వరకు జీతాల రూపంలో ఇవ్వడంతో ప్రభుత్వ రెవెన్యూ 1 లక్ష 40 వేల కోట్లకు చేరబోతుందని అన్నారు. అందుకే రేవంత్ రెడ్డికి ఎప్పుడు డబ్బు కావాలన్న బడే భాయ్ దగ్గరకు వెళతాడని, రేవంత్ రెడ్డి బడే భాయ్ ఎవరని వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ప్రధాని మోడీ రాజనీతిజ్ఞుడు అని ఆయనకు పాలన ఎలా చేయాలో తెలుసని కొనియాడారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎంతో చేశారని, ఇప్పటికే జనవరిలో రూ.9000 కోట్ల అధిక రుణాలు మంజూరు చేశారని, మరో రూ.4000 కోట్లు కూడా అందించాడని, దీంతో రాష్ట్రం రుణాలు తీసుకోవడంలో ఎఫ్తార్బీఎం లిమిట్స్ దాటి పోయిందని అన్నారు. రేవంత్ రెడ్డి గ్యారెంటీలు గాడిదగుడ్లు అని అందుకే మోడీ గ్యారెంటీలకు వారంటీ లేదని చెబుతున్నాడని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version