టిఆర్ఎస్ కు షాక్ : సిద్దిపేట మాజీ కలెక్టర్ పై ఎన్నికల అధికారికి రేవంత్ రెడ్డి ఫిర్యాదు

-

ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ల నేతృత్వం లో కాంగ్రెస్ ప్రతినిధి బృందం బుద్ధభవన్ లో ఎన్నికల ప్రధానాధికారి ని కలిసి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పై ఫిర్యాదు చేస్తారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వెంకట్ రాం రెడ్డి నామినేషన్ పై ఎన్నికల రిటర్నింగ్ అధికారి కి పిర్యాదు చేసామని.. నామినేషన్ పాత్రలు దాఖలు చేసే సమయంలో పిర్యాదు దారులను లోపలికి అనుమతించాలని కోరారు.

ఎన్నికల నిర్వహణ అధికారులు , టీఆరెస్ పార్టీ వెంకట్ రాం రెడ్డికి సహకారం అందిస్తుందని నిప్పులు చెరిగారు.నిన్ననే ఎన్నికల ప్రధానాధికారి కి దీనిపై పిర్యాదు చేసాం. మాకు ఎలాంటి సమాచారం రాలేదని మండిపడ్డారు. నామినేషన్ పాత్రలు పరిశీలించే సమయంలో …ఏవైనా లోటుపాట్లు ఉంటే వెంటనే దాన్ని తిరస్కరించాలని డిమాండ్ చేశారు. మాకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి జాతీయ పార్టీగా మమ్మల్ని లోపలికి అనుమతించమని అడిగితే రానివ్వకుండా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించకపోతే ఢిల్లీలో పిర్యాదు చేస్తామనీ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version