కాంగ్రెస్ పార్టీలో పీకే వ్యవహారం చిన్న పాటి రాజకీయ ప్రకంపనలనే రేపుతోంది. టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు ఉంటుందని వార్తలు వినిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ ను కాంగ్రెస్ పార్టీ ఏదో చర్చలకు పంపించినట్లు కేసీఆర్ ను కలిశారని మీడియా వాళ్లు చూపించడం భావ్యం కాదని రేవంత్ రెడ్డి అన్నారు. అధిష్టానంతో తాను మాట్లాడానని.. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత ప్రదర్శించారని.. పీకే కాంగ్రెస్ చేరికపై 8 మందితో కమిటీ వేసిందని కమిటీ నిర్ణయం తరువాత కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తో పొత్తుకు ఉండదని మాకు రాహుల్ గాంధీ నుంచి స్పష్టత ఉందని ఆయన అన్నారు. ఇతర పార్టీలతో ఒప్పందం ఉండకూడదని కాంగ్రెస్ పార్టీ షరతు విధించిందని.. దీంతోనే పీకే, కేసీఆర్ తో తెగదెంపులు చేసుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీతో పనిచేసేందుకే ప్రశాంత్ కిషోర్ ఆసక్తి చూపిస్తున్నారని ఆయన అన్నారు.