బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన, సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్‌కు వ్యతిరరేకంగా ఏర్పాటు చేసిన సమావేశానికి వీరిద్దరూ చెన్నయ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ భేటీని తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్వహించగా.. సీఎం రేవంత్, కేటీఆర్ వేర్వేరుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి, సరిహద్దులు దాటాక ఆయన్ను కాపాడుకునే బాధ్యత మాది. రేవంత్ రెడ్డి నేను చెన్నైలో డీలిమిటేషన్ మీటింగ్‌కి వెళ్లినప్పుడు, అక్కడ రేవంత్ రెడ్డి పెట్టిన ప్రతిపాదనకు మా తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పింది కరెక్ట్ అని నేను మద్దతిచ్చా’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు 👇👇
రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి, సరిహద్దులు దాటాక ఆయనను కాపాడుకునే బాధ్యత మాది
రేవంత్ రెడ్డి నేను చెన్నైలో డీలిమిటేషన్ మీటింగ్‌కి వెళ్లినప్పుడు, అక్కడ రేవంత్ రెడ్డి పెట్టిన ప్రతిపాదనకు మా తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పింది… https://t.co/MJLgWkc3VK pic.twitter.com/ET2x75WFjB
— Sarita Avula (@SaritaAvula) March 28, 2025