దేవేందర్ గౌడ్ ను కలిసిన రేవంత్ రెడ్డి

-

పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూకుడుగా వెళుతున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీని పతనం చేసే దిశగా.. వచ్చే వారందరినీ కలుపుకునే ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి దేవేందర్‌ గౌడ్‌ ను కలిసారు రేవంత్‌ రెడ్డి. టీఆర్‌ఎస్‌ పార్టీని ఎలా ఎదురుకోవాలనే దానిపై దేవేందర్‌ గౌడ్‌ తో రేవంత్‌ రెడ్డి చర్చించారు.

అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి కోసం పరితపించిన వ్యక్తి దేవేందర్ గౌడ్ అని… ఆయన కుమారుడు వీరేందర్ తనకు మంచి మిత్రుడని తెలిపారు. తెలంగాణ లో కారు దారి తప్పిందని.. దేవేందర్ గౌడ్ పాదయాత్ర తోనే అనాడు కాంగ్రెస్ జలయజ్ఞం జరిగిందన్నారు.

తోండలు గుడ్లు పెట్టని రంగారెడ్డి.. హైదరాబాద్ భూముల ధరలు పెరిగాయి అంటే కారణం దేవేందర్ గౌడ్ అని రేవంత్‌ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో డబుల్ బెడ్ రూం, దళితులకు మూడెకరాల లాంటి సంక్షేమం పేదలకు దూరం అయ్యిందని మండిపడ్డారు. అందరం కలిసి తెలంగాణ భవిష్యత్తు కార్యాచరణ కోసం పని చేస్తామని… కెసిఆర్ వ్యతిరేకుల పునరేకీకరణ లో భాగంగా అందరినీ కలుస్తామన్నారు. తెలంగాణ కు పట్టిన గులాబీ చీడ వదిలిస్తమని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version