UPA ను చీల్చడానికే కేసీఆర్ డ్రామాలు – రేవంత్ రెడ్డి

-

యూపీఏను చీల్చడానికే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నాడని కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. జాతీయ స్థాయిలో జగన్, అసదుద్దీన్ ను ఎందుకు కలుపుకోవడంలేదు ? అని నిలదీశారు. కేసీఆర్ ప్రతీ చర్య.. బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇవ్వడానికే.. ఇలా చేస్తున్నాడని ఆగ్రహించారు. కేసీఆర్ మోదీని ఓడించాలనుకుంటే… బీజేపీ భాగస్వామ్య పక్షాలను బయటకు తీసుకురావాలని కోరారు.

కేసీఆర్ చర్యలన్నీ మోదీ సూచనలతో జరుగుతున్నవేనని ఆరోపించారు. అందుకే ఆయనపై మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడంలేదన్నారు రేవంత్‌ రెడ్డి. ఈఎస్ఐ కుంభకోణం పై ఇప్పటి వరకు కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని.. కాంగ్రెస్ ను బలహీన పరచేందుకే కేసీఆర్, మోదీ ప్రయత్నాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.బీజేపీ వ్యతిరేక శక్తులను బలహీనం చేయాలని కేసీఆర్ చూస్తున్నాడు..బీజేపీని బలహీనం చేయాలంటే బీజేపీని వ్యతిరేకించే శక్తులను కూడగడుతున్నాడని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version