మెడికల్ విద్యార్థులకు తెలంగాణ మంత్రి హరీష్ రావు శుభవార్త చెప్పారు. ఈ సారి అదనంగా 2,200 మెడికల్ సీట్లు పెంచుతున్నట్లు ప్రకటన చేశారు మంత్రి హరీష్ రావు. ఈ విద్య సంవత్సరం 6548 ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్లు చేయబోతున్నామని.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 850 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 2052 చేరుకుందని స్ఫష్టం చేశారు మంత్రి హరీష్ రావు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ లో మూడు మెడికల్ కాలేజీలు వచ్చాయని.. తెలంగాణ వచ్చిన ఏడు సంవత్సరాలలో కొత్తగా 12 మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నామని వెల్లడించారు. ఈ విద్య సంవత్సరంలో 8 మెడికల్ కాలేజీలు వచ్చాయని.. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి 8 మెడికల్ కాలేజీలకు అనుమతి తెచ్చుకున్నామని ప్రకటన చేశారు మంత్రి హరీష్ రావు. 8 కాలేజీల్లో 12 వందల సీట్లకు అడ్మిషన్లు వచ్చాయని… ఉమ్మడి రాష్ట్రంలో ఉక్రెయిన్ లాంటి దేశాలకు వెళ్లి మెడికల్ విద్యను చదువుకునే వారన్నారు.