అన్ని అంశాలను బేరీజు వేసుకునే అభ్యర్థులను ఎంపిక చేస్తాం: రేవంత్ రెడ్డి

-

తెలంగాణాలో నిన్నటి నుండి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రకారం నవంబర్ 30వ తేదీన మొత్తం అయిదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని స్థానాలకు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా, ఇంకా కొన్ని పార్టీలు ప్రకటించాల్సి వస్తుంది. కాగా తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయాల్సిన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలోనే మేమున్నాం అంటూ చెప్పారు. ఈ ఎంపిక ప్రక్రియలో అభ్యర్ధికి సంబంధించిన అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతనే ప్రకటిస్తామంటూ రేవంత్ రెడ్డి చెప్పడం విశేషం. తెలంగాణాలో కాంగ్రెస్ అభివృద్ధి కోసం కష్టపడిన వారిని ఖచ్చితంగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి.

ఇక ఎవరు కాంగ్రెస్ తరపున సీటును పొందుతారు ఆనంది తెలియాలంటే ఇంకొంచెం సమయం వేచి చూడాల్సి ఉంది. ఇక ఈసారి ఎన్నికలు చాలా టైట్ గా జరుగుతాయని మరియు అధికార పార్టీ కూడా మారె చాన్సెస్ ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version