దేశానికి మోడీ, తెలంగాణకు కేసీఆర్‌ నాయకత్వం ప్రమాదకరం : రేవంత్‌రెడ్డి

-

దేశానికి మోడీ, తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ నాయకత్వం ప్రమాద కరమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా గాంధీ భావన్ లో ఇవాళ ఆవిష్కరించారు టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి. టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వి.హెచ్, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, సంపత్ కుమార్, చిన్నారెడ్డి, మధు యాష్కీ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మతం పేరుతో రాజకీయం చేస్తుంది బీజేపీ అని.. చిల్లర ప్రయత్నాల తో కాంగ్రెస్ చరిత్ర రూపు మాపలేరన్నారు. దేశానికి మంచి రోజులు రావాలంటే.. కాంగ్రెస్ అధికారం లోకి రావాలని పేర్కొన్నారు. సోనియా గాంధీ నాయకత్వం లోనే దేశానికి రక్షణ అని.. విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలను భూస్థాపితం చేయాల్సిన బాధ్యత గాంధేయ వాదులపై ఉందని చెప్పారు. పార్లమెంట్ లో 80 మంది కంటే ఎక్కువ మహిళలు లేరని.. పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి అనేది ఆడ బిడ్డల అభిప్రాయమన్నారు. కానీ ఆడ బిడ్డల పెళ్లి విషయంలో హాడా హుడి నిర్ణయం సరికాదని మండిపడ్డారు. అమ్మాయిల అభిప్రాయం తీసుకోవాలన్నారు. సోనియా, రాహుల్ గాంధీ ల నాయాక్త్వం లో ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version