టార్గెట్ ‘నిర్మల్’…మంత్రి గారికి షాక్ తగిలేలా ఉందే…

-

ఈ మధ్య తెలంగాణ రాజకీయాల్లో నిర్మల్ బాగా హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే ప్రతి పార్టీ అక్కడే ఎక్కువ సభలు పెడుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు నిర్మల్‌నే ఎక్కువ టార్గెట్ చేశాయి. టి‌పి‌సి‌సి అధ్యక్ష పీఠం దక్కగానే రేవంత్ రెడ్డి…మొదట అక్కడ నుంచే పోరాటం మొదలుపెట్టారు. తాజాగా బి‌జే‌పి కూడా అమిత్ షాని తీసుకొచ్చి పెద్ద ఎత్తున సభ నిర్వహించి సక్సెస్ అయింది.

రేవంత్ రెడ్డి | Revanth Reddy

అయితే ఇలా ప్రతిపక్షాలు నిర్మల్‌ని టార్గెట్ చేసి ముందుకెళుతున్నాయి. ఇక ఈ సారి నిర్మల్ నియోజకవర్గంలో కూడా హోరాహోరీ ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. ఈ సారి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి టఫ్ ఫైట్ ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన…నిర్మల్‌లో తిరుగులేని విజయాలు సాధించారు. 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇంద్రకరణ్…2014లో బి‌ఎస్‌పి నుంచి గెలిచి టి‌ఆర్‌ఎస్‌లో చేరి మంత్రి అయ్యారు. 2018లో టి‌ఆర్‌ఎస్ నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు.

ఇక మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్‌పై అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి. భూ కబ్జాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పైగా అధికార టి‌ఆర్‌ఎస్‌పై ఇప్పుడుప్పుడే వ్యతిరేకత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇటు ప్రతిపక్షాలు కూడా నిర్మల్‌లో సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలో ఈ సారి నిర్మల్‌లో హోరాహోరీ పోరు జరిగేలా కనిపిస్తోంది.

టి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్‌ల మధ్య టఫ్ ఫైట్ నడిచేలా ఉంది. ఇంద్రకరణ్‌కు కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నారు. ఇక్కడ బి‌జే‌పికి పెద్ద సీన్ లేదు. కానీ రాష్ట్రంలో బి‌జే‌పి కూడా పుంజుకుంటుంది కాబట్టి, నెక్స్ట్ ఎన్నికల్లో ఫైట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఈ సారి ఇంద్రకరణ్ గెలుపు అంత సులువు కాదని తెలుస్తోంది. మరో రెండేళ్లలో పరిస్తితి ఏమన్నా కాస్త అటు, ఇటు అయితే…నిర్మల్‌లో జెండా మారిపోవచ్చు. ఈ సారి మంత్రిగారికి షాక్ తగిలే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version