Breaking : రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌

-

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా కేసులు భారీగా పెరుగుతూ టెన్షన్ పెడుతున్నాయి. అయితే ఇప్పటికే కరోనా దాదాపు సామాన్యులతో పాటు సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు సైతం సోకింది.  తాజాగా కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డికి కరోనా సైతం కరోనా సోకింది, ఆయనకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు కనిపించడంతో.. ఇవాళ ఉదయం రేవంత్‌రెడ్డి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.

ఈ పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఎంపీ రేవంత్‌ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తనకు కరోనా సోకిందని ప్రకటించిన రేవంత్  కొద్ది రోజులుగా త‌న‌ను క‌లిసిన వారంతా తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్‌ రెడ్డి కోరారు. ఇక కొద్ది రోజుల క్రితమే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. 

Read more RELATED
Recommended to you

Exit mobile version