కాంగ్రెస్‌లో కోవర్టుల కలకలం.. రేవంతా? ఉత్తమా?

-

కోవర్టు అనే మాట కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ..సొంత పార్టీనే డ్యామేజ్ చేస్తూ..ఇతర పార్టీలతో రహస్య ఒప్పందాలు కుదురుచుకుని కోవర్టు రాజకీయం చేసే నేతలు కాంగ్రెస్‌లో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఎక్కువగానే ఉన్నారు. వారి వల్లే పార్టీ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. కాంగ్రెస్‌లో కొందరు టీఆర్ఎస్‌కు, కొందరు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

అసలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే..తమ పార్టీలో కోవర్టులు ఉన్నారని, ఇప్పటికీ ప్రగతి భవన్‌ నుంచి కొందరు నేతలకు పింఛన్లు వస్తున్నాయని సెటైర్లు వేస్తుంటారు. ఏదేమైనా కాంగ్రెస్‌లో కోవర్టులు ఉన్నారనేది క్లియర్‌గా అర్ధమవుతుంది. అయితే ఇటీవల మంత్రి కేటీఆర్ సైతం..కాంగ్రెస్‌లో ఒకరిద్దరు ఎంపీలు కోవర్టులుగా పనిచేస్తున్నారని, వారు బీజేపీలోకి వెళ్తారని అంటున్నారు.

ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలా కోవర్టుగా పనిచేసి..ఇప్పుడు బీజేపీలోకి వెళ్లారని చెప్పుకొచ్చారు. అయితే ఎంపీల్లో కూడా కోవర్టులు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉంది ముగ్గురు ఎంపీలు..రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి..ఇందులో వెంకటరెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్‌పై గుర్రుగా ఉన్నారు..ఆయన కాంగ్రెస్‌లో సరిగ్గా పనిచేయడం లేదు. ఎలాగో ఆయన సోదరుడు బీజేపీలోకి వెళ్లారు. దీంతో వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వెళ్తారని ప్రచారం ఉంది. ఇక్కడ కోమటిరెడ్డిని పక్కన పెడితే..రేవంత్, ఉత్తమ్ ఎంపీలుగా ఉన్నారు. మరి వీరిలో కోవర్టు ఎవరనే చర్చ నడుస్తోంది. గతంలో ఉత్తమ్ పి‌సి‌సిగా పనిచేసినప్పుడు ఆయన టీఆర్ఎస్ కోవర్టు అని విమర్శలు వచ్చాయి.

ఇప్పుడు అలాంటి విమర్శలు రావడం లేదు. మరి అలాంటప్పుడు రేవంత్ అవుతారా? అంటే రేవంత్‌కు టీఆర్ఎస్ అంటే పడదు. మరి బీజేపీతో ఓకేనా అంటే..ఆ పార్టీపై యుద్ధం చేస్తున్నారు. అలాంటప్పుడు కేటీఆర్ ఒక మైండ్ గేమ్ ప్లే చేశారని అర్ధమవుతుంది. కాంగ్రెస్ శ్రేణులుని కన్ఫ్యూజన్‌లో పడేయడానికి ఇలా కోవర్టులు ఉన్నారని డైలాగులు వేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా గాని కాంగ్రెస్ లో మాత్రం కోవర్టులు ఉన్నారని గట్టిగా చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version