తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఈరోజు హైదరాబాద్లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరీష్ రావు తెలివి మోకాళ్లలో కాదు అరికాళ్ళలోకి జారినట్టు ఉందని ఎద్దేవ చేశారు. మోసం చేయాలని ప్రతీసారి హరీష్ రావుకి అమరవీరుల స్తూపం గుర్తుకొస్తుంది అని వారి మోసానికి ముసుకు అమరవీరులు స్థూపం అని అన్నారు.
ఎప్పుడైనా అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్లారా అని రేవంత్ రెడ్డి అడిగారు. చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటాడు రాజీనామా లేక అలా ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖ లో రాసుకోచ్చాడు. స్పీకర్ ఫార్మేట్ లో లేకుంటే రాజీనామా లేక చెల్లదు అని హరీష్ రావు తెలివి ప్రదర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు హరీష్ తెలివి మోకాళ్ళలో కాదు అరికాళ్ళలో జారినట్టు ఉందని అన్నారు.