కేటీఆర్ కాదు కేడిఆర్.. ఆంధ్ర నాయకుడిగా పేరు మార్చుకో : రేవంత్

-

తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి.. కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. తాను టిడిపి అయితే… కెసిఆర్ ఏంటి.. ఏ పార్టీ వచ్చాడని… మీ పార్టీలో ఉన్న వాళ్లంతా…టీడీపీ వాళ్ళే కదా అని ప్రశ్నించారు. కెసిఆర్.. టీఆర్ఎస్ కు ఎలా అధ్యక్షుడో…తాను అలాగే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షున్ని అని చురకలు అంటించారు. టీఆర్ఎస్ మంత్రులు అంతా టిడిపినే కదా..? అని పేర్కొన్నారు. కేటీఆర్ కాదు… కేడిఆర్ అని పిలుస్తా.. అవసరమైతే డ్రామా రావు అని కూడా పిలుస్తానని ఫైర్ అయ్యారు. కేటీఆర్ అసలు పేరు అజయ్ అని.. ఎన్టీఆర్ ను భ్రమ కల్పించడం కోసమే కేటీఆర్ అని పెట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

హరీష్ బతుకే కాంగ్రెస్ కదా.. ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసింది కాంగ్రెస్ అని మండిపడ్డారు. నీకు రాజకీయ బిక్ష పెట్టింది సోనియా, వైఎస్ బిక్ష కదా ? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో 75 శాతం టిడిపి నుండి వచ్చిన వాళ్ళేనని.. కేటీఆర్ పేరే బిచ్చం ఎత్తుకుని పెట్టుకున్నారని ఆరోపణలు చేశారు.

మీకు గతి లేకే…ఎల్. రమణ కాళ్ళు పట్టుకున్నారని.. ఇప్పుడు కూడా టిడిపినే మీకు దిక్కు అయ్యిందని ఫైర్ అయ్యారు. మీ దగ్గర టిడిపి కాకుండా ఉన్నది ఎవరో చెప్పాలని నిలదీశారు. కేటీఆర్ కి పౌరుషం ఉంటే…ఆంధ్ర నాయకుడు అని పేరు మార్చుకోవాలని.. మీ పెద్ద నాన్న రంగారావు మంచోడు… ఆయన పేరు పెట్టుకోవాలని చురకలు అంటించారు. మోసమే మీ కుటుంబానికి పెట్టుబడి అని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version