సీఎం కేసీఆర్ కి రేవంత్ సూటి ప్రశ్న.. ఫామ్‌హౌస్‌లో ఉంటే కరోనా తగ్గుతుందా..?

-

క‌రోనా మహమ్మారి పేరుతో ప్రైవేట్ ఆస్ప‌త్రులు ఏ రేంజ్‌లో దోచుకుంటున్నాయో తెలిపే తాజా ఘ‌ట‌న ఒకటి హైదరాబాద్ లో వెలుగుచూసింది. ఒక్క రోజు చికిత్స‌కే లక్ష రూపాయలకు పైగా బిల్లు వేయ‌డం ఏంటని చాద‌ర్‌ఘ‌ట్‌లోని తుంబే హాస్పిటల్‌ లో చేరిన ఫీవర్ ఆసుపత్రి డీఎంవో సుల్తానా ఆవేదన వ్యక్తం చేసింది. పైగా ఆస్ప‌త్రి సిబ్బంది ఆమెను నిర్బంధించారు. దీంతో ఏం చేయాలో తెలియ‌క ఆమె ఓ సెల్ఫీ వీడియో తీసి.. త‌న‌ను కాపాడ‌లంటూ తెలిసిన‌వారికి పంపారు. ఆ వీడియో కాస్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ ఘ‌ట‌న‌పై ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి సెల్ఫీ వీడియోను రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఒక్క రోజుకు ఆస్పత్రి యాజమాన్యం రూ.లక్ష బిల్ చేసిందని, ప్రశ్నించిన సుల్తానాను ఆస్పత్రిలో బంధించారని ధ్వజమెత్తారు. సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదను చెప్పిందని, సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌ క్వారంటైన్లో ఉంటే తెలంగాణలో కరోనా తగ్గుతుందా? అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. బాధితురాలి సెల్ఫీ వీడియో సోష‌ల్ మీడియాతో పాటు.. మీడియాలో రావడం పై వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్పందించి తుంభే ఆసుపత్రిలో ఉన్న కోవిడ్ బారిన పడ్డ వారందరినీ నిమ్స్ తరలించాలని అదికారులను సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version