విజయనగరం: రామతీర్థంలోని శ్రీరాములవారి ఆలయాన్ని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామతీర్థం కొండపై జనవరి నాటికి రాముల వారి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పారు. కొండపై ఆలయ నిర్మాణానికి అవసరమైన వసతులు సమకూర్చి అనుకున్న సమయానికి ఆలయాన్ని పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఆగమ శాస్త్ర ప్రకారం పలువురు పండితులు, స్వామీజీల సూచనలు, సలహాలు తీసుకున్నామని పేర్కొన్నారు.