మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో రెవెన్యూ ఉద్యోగులు అవిరాళంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. శుక్రవారం రోజు తెలంగాణ స్టేట్ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రూపొందించిన డైరీ నీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…వీఆర్ఏలు,వీఆర్వోలు ,రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు తొందరగానే పరిష్కరిస్తామన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం శ్రద్ధతో పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రమోహన్,ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి,అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, ఉపేందర్ రెడ్డి వీఆర్వోల సంఘం అధ్యక్షుడు గోల్కొండ సతీష్, వైస్ ప్రెసిడెంట్స్ కే చంద్రకళ, చంద్రయ్య, చంద్రావతి పాల్గొన్నారు.