ప్రస్తుతం కుండపోతగా కురుస్తున్న వర్షాలతో నగరం మొత్తం జలదిగ్బంధంలో కి వెళ్లి పోతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. అయితే తాజాగా ఈ అంశంపై మీడియా సమావేశం నిర్వహించిన మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి… లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు.
అయితే ప్రస్తుతం నగరాన్ని మొత్తం వర్షం ముంచెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి బాధితులకు సరైన సహాయం అందడం లేదు అంటూ ఆరోపించారు. ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తీర్చాలి అంటూ డిమాండ్ చేశారు. ఇక పురపాలక శాఖ మంత్రి కేటీఆర్… కార్యాలయాన్ని వదిలి బయటికి వస్తే నగరంలో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారో అర్థమవుతుందని… నగరంలోని పరిస్థితులను పర్యవేక్షించాలి అంటూ డిమాండ్ చేశారు. అంతేకాకుండా అధికారులు ఎవరికి ఎలాంటి హాని కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు,