RGV :ఆర్జీవీ మరో సంచలనం : రకరకాల భార్యలపై వెబ్ సిరీస్

-

రామ్ గోపాల్ వ‌ర్మ అంటేనే సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్. ఆయ‌న మాట‌ల‌తోనే కాదు సినిమాల‌తో కూడా వివాదాస్ప‌ద‌మ‌వుతుంటారు. ఇప్ప‌టికే ఎన్నో సంచ‌ల‌న సినిమాలు తీసి త‌న మార్కును చూపించారు. ఇప్పుడు ఓ కొత్త సినిమాతో వ‌స్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ టాలీవుడ్‌లో తీయ‌ని సినిమాతో సంచ‌ల‌నంగా మారారు వర్మ.

అయితే…తాజాగా ఈ వివాదస్పద దర్శకుడు రాం గోపాల్‌ వర్మ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సమాజంలో రకరకాలుగా ఉన్న భార్యల పై కొత్త వెబ్‌ సిరీస్‌ తీస్తున్నట్లు తాజాగా ప్రకటించారు రాం గోపాల్‌ వర్మ.

భార్యలు, వాళ్లల్లో రకాలు అనే అంశాన్ని చూపిస్తూ… ఈ సిరిస్‌ ఉండనుండగా.. ఈ వెబ్‌ సిరీస్‌లో 30 వెడ్స్‌ 21 ఫేమ్‌ చైతన్య కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మేరకు ” స్త్రీల అసలు స్వరూపం వాళ్లు భార్యలుగా మారినప్పుడే విశ్వరూపమై బయటకు వస్తుంది” అనే వాయిస్‌ ఓవర్‌తో రాం గోపాల్‌ వర్మ ఓ టీజర్‌ను కూడా రిలీజ్‌ చేసేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version