వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీ విషయమై తన అభిప్రాయాలను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదిక గా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతుంటారు. వివాదాలను క్రియేట్ చేసి అలా సంచలనాలు రేపుతుంటారు. అయితే.. తాజాగా మునుగోడు ఉప ఎన్నికపై వర్మ స్పందించారు.
‘కేఏ పాల్’ పై వర్మ మరోసారి తన ట్వీట్స్ తో రెచ్చిపోయాడు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేఏ పాల్ డిపాజిట్ కోల్పోయిన సంగతి తెలిసిందే. అందుకే, వర్మ కే ఏ పాల్ పై సెటైర్లు వేశారు. ‘కేఏ పాల్ ISIS మరియు ALQAEDA లోని తన స్నేహితులను మునుగోడు నియోజకవర్గంలో బాంబులు వేయడానికి ఉపయోగిస్తున్నారని ఇప్పుడే విన్నాను, హే మునుగోడు ప్రజలారా త్వరగా పరిగెత్తండి’. అంటూ వర్మ ఒక ఫన్నీ పోస్ట్ పెట్టాడు. ఇక కేఏ పాల్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం మంచిది అంటూ వర్మ, కేఏ పాల్ కి ఒక సలహా ఇచ్చాడు.