నేడే కార్తీక పౌర్ణమి.. శివ నామ స్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

-

తెలంగాణ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు వేకువ జామునే పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలకు తరలి వెళ్తున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదగిరి లక్ష్మినరసింహ స్వామి ఆలయం, వరంగల్ భద్రకాళీ టెంపుల్, వేయి స్థంభాల గుడి, కొండగట్టు, బాసర, భద్రాద్రి రామాలయం, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం సహా పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదిదేవుడి దర్శనం కోసం ఆలయాల్లో భక్తులు బారులు తీరుతున్నారు. ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించి దేవదేవుడి నామాన్ని స్మరించుకుంటున్నారు. ఇక ప్రముఖ దివ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తున్నారు. నరసింహ స్వామి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి రావడంతో క్యూలైన్లలో సందడి నెలకొంది. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆలయ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఆలయ ప్రాంగాణాన్ని శుభ్ర పరుస్తున్నారు. భక్తుల మధ్య సామాజిక దూరం ఉండేలా చూస్తున్నారు. అయితే.. రేపు చంద్రగ్రహణం ఉండటంతో దేవాలయాలను మూసివేయనున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో నేడే కార్తీక పౌర్ణమి వేడుకల ఘనంగా జరుపుకుంటున్నారు భక్తులు.

ఇదిలా ఉంటే.. పవిత్ర కార్తీకమాసం గిరిప్రదక్షిణ పురస్కరించుకొని తమిళనాడు తిరువణ్ణామలైకి ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్యాకేజీ సర్వీసులకు విశేష స్పందన లభించినట్లు తిరుపతి డిపో మేనేజర్‌ బాలాజీ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం వరకు రెండు ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు సంబంధించి 100మంది, అల్ర్టా డీలెక్స్‌కు 40మంది, శ్రీకాళహస్తి డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించి 50మంది టికెట్స్‌ను నమోదు చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు. బస్సు బయల్దేరు సమయానికి అర్దగంట ముందుగా బస్టాండుకు చేరుకోవాల్సి ఉంటుందని ఉంటుంది. సోమవారం ఉదయం వరుసగా 6.15, 6.30, 6.45గంటలకు తిరుపతి సీబీఎస్‌లోని ప్లాట్‌ఫామ్‌ నెంబరు 27నుంచి బస్సులు బయల్దేరనున్నాయి. శ్రీకాళహస్తి నుంచి 5.30 గంటలకు బయల్దేరుతుంది. వయా కాణిపాకం, వేలూరు గోల్డెన్‌ టెంపుల్‌ సందర్శించి మధ్యాహ్నం 2.30గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటాయి. రాత్రి 10.30 గంటలకు అక్కడి నుంచి తిరుగు ప్రయాణమై మంగళవారం ఉదయం చేరుకుంటాయి. ఈ మేరకు పోను రాను ప్రయణానికి పెద్దలకు రూ. 630, పిల్లలకు రూ. 340గా టిక్కెట్‌ ధరగా నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version