‘పవర్‌ స్టార్’‌ నుంచి వరుస వీడియోలు.. వర్మ డైలాగ్స్ మామూలుగా లేవుగా..!

-

దర్శకుడు ఆర్జీవీ ‘పవర్‌ స్టార్‌’ పేరుతో తీస్తున్న సినిమా విడుదలకు ముందే సంచలనాలను సృష్టిస్తుంది. రేపు సినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన వర్మ ఈ సినిమాకు సంబంధించిన వీడియోలను ఒక్కొక్కటిగా ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. బండ్ల గణేశ్‌ను పోలిన వ్యక్తి పొగుడుతున్న వీడియో, చంద్రబాబును పోలిన వ్యక్తి ప్రవన్‌తో మాట్లాడుతున్న వీడియో, చిరంజీవి పోలిన వ్యక్తి ప్రవన్ పై అరుస్తున్న వీడియోలను శుక్రవారం ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

రెచ్చ‌గొడుతున్న‌ట్టు  క్యాప్షన్స్‌ కూడా ఇచ్చాడు.  వాళ్లు బ్రదర్సేనా? అని చిరు, ప‌వ‌న్ క‌ల్యాణ్ వీడియోకు, అలాగే చంద్ర‌బాబు-ప‌వ‌న్ వీడియోకు ఎవ‌రు మాట్లాడుతున్నారో ఊహించండంటూ  క్యాప్ష‌న్ పెట్ట‌డం కొంద‌రికి ఆనందం, మ‌రికొంద‌రిలో ఆగ్ర‌హం తెప్పిస్తున్నాయి. కాగా, ఇప్ప‌టికే రిలీజ్ అయిన ట్రైల‌ర్ యూట్యూబ్ ట్రెండింగ్ లో మొదటి స్థానంలో ఉంది. అలాగే ఇది క్రియేట్ చేసిన రచ్చతో ఆర్జీవీ కార్యాల‌యంపై జ‌న‌సైనికుల దాడి చేసిన విషయం తెలిసిందే.

pawan kalyan

Read more RELATED
Recommended to you

Exit mobile version