చావు అందరికీ సమానమే : పునీత్‌ రాజ్‌ కుమార్‌ మృతిపై RGV ట్వీట్

-

కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కాసేపటి క్రితమే మృతి చెందారు. కన్నడ ఇండస్ట్రీలో దేవుడిగా కొలిచే రాజ్ కుమార్ తనయుడు.. పునీత్ రాజ్కుమార్ ఇక లేడన్న విషయం ఆయన అభిమానులను శోకసంద్రం లోకి నెట్టింది. జిమ్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిన పునీత్.. చికిత్స పొందుతూ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మరణించారు.

46 సంవత్సరాల వయసులోనే ఆయన మృతి చెందడం చిత్ర పరిశ్రమను కుదిపేసింది. ఇక ఆయన మృతి పట్ల.. సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ… పునీత్ రాజ్ కుమార్ మృతిపై స్పందించారు.

” పునీత్ రాజ్‌కుమార్ ది’ఆకస్మిక మరణం.. మనలో ఎవరైనా ఎప్పుడైనా చనిపోవచ్చు అనేది భయంకరమైన నిజం. కాబట్టి మనం జీవించి ఉండగానే ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్‌లో జీవించడం ఉత్తమం. మరణానికి ఎలాంటి పక్షపాతం లేదు. అది ఎవరినైనా తన ఇష్టానుసారంగా తీసుకుపతుంది. ” అంటూ తన స్టైల్ లో రం గోపాల్ వర్మ స్పందించారు. ఇక అటు టాలీవుడ్ లోని ప్రముఖులు కూడా పునీత్ రాజ్‌కుమార్ మరణం పై తమ సంతాపం తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version