
ఆంధ్రాలో ఓ పక్క కరోనా కలకలం సృష్టించి వార్తల్లో నిలుస్తుంటే మరోపక్క తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నాడు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. పార్టీ లోని వారితో ప్రాణహాని ఉందంటాడు కానీ పార్టీ మారడు, పార్టీ పై దురుసు వ్యాఖ్యలు చేస్తాడు కానీ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను దైవ సమానంగా చూస్తున్నాను అంటాడు, పార్టీ షోకాజ్ నోటీసులు ఇస్తే తనకేమి పట్టానట్టే ఉంటాడు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఇక తన వైఖరిని పరిగణలోకి తీసుకొని వివాదాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్టర్ అకౌంట్ లో ఓ పోస్టు పెట్టాడు. ఆయన మాట్లాడుతూ.. సినిమా ప్రేమికుడు రాజమౌళి తన ఆర్‌ఆర్‌ఆర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమా రంగాన్ని ఎప్పుడు కాపాడతాడో నాకు తెలియదు కానీ జగన్ ప్రేమికుడు ఆర్‌ఆర్‌ఆర్ (రఘురామ కృష్ణంరాజు) వైసీపీని కాపాడేందుకు వచ్చేశాడు. జగన్ పై ఆయన స్వచ్చమైన ప్రేమను కనబరుస్తున్నారు ఆ విషయం నాకు సంతోషాన్ని ఇస్తుంది అంటూ ఓ వ్యంగ్యమైన ట్వీట్ ను చేశాడు. ఇప్పుడు ఆయన ట్వీటు వైరల్ అవుతుంది.