పెద్ద చిత్రాలపై KGF2 దెబ్బ..RGV సెటైరికల్ ట్వీట్

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అలియాస్ RGV..ఎప్పుడూ ఏదో ఒక విషయమై మీడియా హెడ్ లైన్స్ లో ఉంటుంటారు. వివాదానికి తానే కేరాఫ్ అయి ముందు నడిపిస్తుంటాడు వర్మ. తాజాగా వర్మ..సంచలన విజయం సాధించిన KGF చాప్టర్ 2 ఆసక్తికర ట్వీట్ చేశారు.

KGF చాప్టర్ 2 అనే చిత్రం పెద్ద చిత్రాలన్నిటపైన ప్రళయంలా మారిందని, పెద్ద చిత్రాల నిర్మాతలు, దర్శకులు, స్టార్స్ అందరిపైన ఈ చిత్ర ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఆర్జీవీ ట్వీట్ పైన నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. వర్మ.. కావాలనే KGF చాప్టర్ 2 పైన ఇంకా హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నారని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. RRR వంటి గొప్ప చిత్రం కన్న KGF చాప్టర్ 2 పెద్దదేమీ కాదని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

మొత్తంగా రామ్ గోపాల్ వర్మ..KGF చాప్టర్ 2 ఫిల్మ్ పైన ప్రశంసలు కురిపిస్తూనే ఇతర ఇండస్ట్రీల దర్శకులు, స్టార్ హీరోలు, మేకర్స్ పైన ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే KGF చాప్టర్ 2 డైరెక్టర్ ప్రశాంత్ నీల్..తనకు మూవీ మేకింగ్ లో RGV ఇన్ స్పిరేషన్ అని పేర్కొనడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version