వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీ విషయమై తన అభిప్రాయాలను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదిక గా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతుంటారు. వివాదాలను క్రియేట్ చేసి అలా సంచలనాలు రేపుతుంటారు. అయితే.. తాజాగా సంచలనానికి తెర తీశారు RGV.
తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరోక్షంగా పవన్, బాబుల భేటీని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ‘కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని, కమ్మోళ్ళకి అమ్మేస్తాడని ఊహించలేదు, RIP కాపులు, కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు’ అంటూ ఆర్జీవి కాస్త గాటుగా స్పందించారు. వర్మకు జనసేన పార్టీ కార్యకర్తలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఒకప్పుడు రంగీలా, సర్కార్ లాంటి సినిమాలు తీసి జాతీయ, అంతర్జాతీయ మెప్పు పొందిన వ్యక్తి మరీ ఈ స్థాయికి పడిపోవడం దురదృష్టకరమన్నారు. అమ్మేయడానికి కులాలు కులాలు కట్టుగట్టుకుని ఏ నాయకుడికి దాసోహం చెప్పావు, చెప్తే ఎవరికో అమ్మడం ఎందుకు ఆయనే సీఎం అవుతాడు కదా అంటూ మండిపడుతున్నారు.
కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని ,కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు ..RIP కాపులు , కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు 😔😔😔
— Ram Gopal Varma (@RGVzoomin) January 8, 2023