బ్రేకింగ్ : డ్రగ్స్ కేసులో రియాకి బెయిల్, కానీ !

-

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో రియాకు ఊరట నిచ్చింది బాంబే హైకోర్టు. రియాకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఆమె సోదరుడు సోవిక్‌ కి ,మాత్రం బెయిల్ ని తిరస్కరించింది. ఆయన రిమాండ్‌ ను అక్టోబర్‌ 20 వరకు పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్‌ 8నుంచి రియా చక్రవర్తి జైల్లోనే ఉంది. సెప్టెంబర్‌ 30న ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వులో ఉంచింది. బెయిల్‌ ఇవ్వొద్దని న్యాయస్థానాకి ఎన్సీబీ విజ్ఞప్తి చేసింది.

బెయిల్‌ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సుశాంత్‌కు డ్రగ్స్‌ సరఫరా చేయడంలో రియా హస్తం ఉందని స్పష్టం చేసింది. రియా,ఆమె సోదరుడు డ్రగ్స్‌ సరఫరా చేశారని, అది తీవ్రతరమైన నేరమని కోర్టుకు తెలిపారు. అయితే అన్ని వాదనలు విన్న కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆమె ముంబై విడిచి వెళ్లరాదని, లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది కోర్టు. ప్రతి పదిరోజులకి పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం చేయాలనీ ఆదేశించింది కోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version