బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై దేశవ్యాప్తంగా భారీ ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. శుక్రవారం ప్రారంభమైన.. ఈ నిరసనలు ఇప్పటికీ జరుగుతున్నాయి. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జార్ఖండ్ రాజధాని రాంచీలో కూడా అల్లర్లు జరిగాయి. పోలీసులు-నిరసనకారులు రాళ్లు, కట్టెలతో గొడవలకు దిగారు.
ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. అలాగే పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాలోనూ ఘర్షణలు జరిగాయి. నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో పరిస్థితి ఉధ్రిక్తంగా మారింది. ఆ తర్వాత పోలీసులు గాల్లో టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ మేరకు రాంచీలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. కమ్యూనికేషన్ సేవలను నిలిపివేసింది. అలాగే యూపీ, ఢిల్లీ రాష్ట్రాల్లోనూ అల్లర్లు జరిగాయి. భారతదేశంలోనే అతిపెద్ద మసీదులలో ఒక్కటైన జామా మసీదు వల్ల భారీ ఎత్తున నిరసన కారులు ఆందోళన చేపట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.