బాలీవుడ్ ఊర్వశి రౌతేలా, యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్‌లు సోషల్ మీడియా వేదికగా మాటల దాడి దిగారు. ఓ ఇంటర్య్వూలో ఊర్వశీ చేసిన కామెంట్స్‌పై రిసెంట్‌గా పంత్ కౌంటర్ ఇవ్వగా.. తాజాగా అతడి వ్యాఖ్యలను తిప్పికొడుతూ రీకౌంటర్‌గా ఓ పోస్ట్ చేసింది ఊర్వశి. అసలేం జరిగిందంటే?
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఊర్వశి.. పంత్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. అయితే దానిపై స్పందించిన పంత్.. ఊర్వశిపై సెటైర్ వేస్తూ ఓ పోస్ట్ చేశాడు. ‘కొందరు ఫేమ్, పాపులారిటీ కోసం ఇంటర్వ్యూల్లో ఎందుకు ఇలా అబద్ధాలు చెబుతారో అర్థం కాదు. కేవలం వార్తల్లో నిలిచేందుకు ఇలా చేస్తారంటే ఫన్నీగా ఉంది. పేరు కోసం, ఫేమ్ కోసం ఇంతగా పాకులాడే వారిని చూస్తుంటే బాధగా ఉంటుంది. వాళ్లకి దేవుడి ఆశీస్సులు ఉండాలి’ అని ఇన్‌స్టా స్టోరీలో పంత్ రాసుకొచ్చాడు.
దీంతో తాజాగా పంత్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ అతడికి రీకౌంటర్‌గా ఓ పోస్ట్ వదిలింది ఊర్వశి. అంతేకాదు పరోక్షంగా పంత్‌ను కౌగర్ హంటర్(తన కంటే ఎక్కువ వయసున్న అందమైన అమ్మాయిలతో లైంగిక సంబంధం కోరుకునే పురుషుడు)గా అంటూ చురక అట్టించింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. “చోటా భయ్యా నువ్వు బ్యాట్ బాల్‌తో ఆడుకో.. నేను మున్నిని కాదు. నీ లాంటి పిల్లా బచ్చా వల్ల బద్నాం అవ్వడానికి” అంటూ ఘాటూ వ్యాఖ్యలు చేసింది.అంతేకాదు ఈ పోస్ట్‌కు రక్షాబంధన్ శుభాకాంక్షలు, ఆర్‌పీ భాటుభయ్యా, కౌగర్ హంటర్, డోంట్ టేక్ అడ్వంటేజ్ ఆఫ్ ఏ సైలెంట్ గర్ల్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేసింది. దీంతో ఊర్వశి పోస్ట్ సోషల్ మీడియా హాట్ టాపిక్‌గా నిలిచింది.
పంట్ సెటైర్ వేయకుముందు పాల్గొన్న ఇంటర్వ్యూలో మాట్లాడూతూ.. ‘వారణాసిలో నేను ఓ మూవీ షూటింగ్‌లో పాల్గొన్నా. అక్కడి నుంచి దిల్లీకి ఓ షోలో పాల్గొనడానికి ఫ్లైట్ ఎక్కి వెళ్లా. దిల్లీలో రోజంతా షూటింగ్‌లో పాల్గొన్నా. మళ్లీ ఆ తర్వాతి రోజు ఫ్లైట్ పట్టుకుని, వారణాసికి వెళ్లాలి. ఆ సమయంలో నన్ను కలవడానికి అతను వచ్చాడు. నేను ఉంటున్న హోటల్‌కు వచ్చి లాబీలో వెయిట్ చేశాడు. నాకు ఆ విషయం తెలీదు. అతను వచ్చిన 10 నిమిషాల ముందే నేను షూటింగ్ నుంచి హోటల్‌కు వచ్చి బాగా అలిసిపోయి పడుకున్నా. అతను వచ్చిన విషయం కానీ, నా కోసం వెయిట్ చేస్తున్న విషయం కానీ నాకు తెలీదు. లేచి చూసేసరికి 17 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను చాలా ఫీల్ అయ్యా.. నా కోసం అతను అంతలా వెయిట్ చేయాల్సి వచ్చిందని బాధపడ్డాను. వెంటనే ఫోన్ చేసి, ముంబయి వచ్చాక కలుస్తానని చెప్పాను. చెప్పినట్టే ముంబయికి వెళ్లి కలిసాను.అయితే అప్పుడు మీడియా వాళ్లు చుట్టూ చేరి ఇష్టమొచ్చినట్లు కథనాలు రాశారు. ఏది ఏమైనప్పటికీ ఓ డెవలప్ అవుతున్న విషయాన్ని మీడియా చెడగొట్టడంలో ముందుంటుంది” అని చెప్పింది.