హింసకు దూరంగా ఉండండి అంటూ రిషీ కపూర్ లాస్ట్ ట్వీట్…!

-

బాలీవుడ్ లో వరుస విషాదాలు ఇప్పుడు ఆందోళనగా మారాయి. ఒక పక్క దేశంలో కరోనా వైరస్ తో ఇబ్బందులు పడుతున్న తరుణంలో అగ్ర నటుల మరణాలు బాలీవుడ్ ని షేక్ చేస్తున్నాయి. ఇర్ఫాన్ ఖాన్ మరణించిన విషయాన్ని మరువక ముందే అగ్ర హీరో గా ఒక వెలుగు వెలిగిన రిషీ కపూర్ మరణించారు.క్యాన్సర్ తో ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడం తో తుది శ్వాస విడిచారు.

ఆయన మరణం తో బాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయనకు రొమాంటిక్ హీరోగా కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆయన ఈ నెల 2 న ట్విట్టర్ లో లాస్ట్ ట్వీట్ చేసారు. కరోనాతో పోరాడుతున్న వైద్యుల గురించి ఆయన ఈ ట్వీట్ చేసారు. అన్ని హోదాల నుంచి, అన్ని విశ్వాసాల నుండి వచ్చిన సోదర సోదరీమణులకు విజ్ఞప్తి…

దయచేసి హింసకు రాళ్ళు విసరడం వంటి చర్యలకు దిగవద్దు. ఎవరిని చంపవద్దు. వైద్యులు, నర్సులు, మెడికోలు, పోలీసులు తదితరులు మిమ్మల్ని రక్షించడానికి వారి ప్రాణాలకు ప్రాణాలకు ముప్పు ఉన్నా సరే మీ కోసం పోరాటం చేస్తున్నారు. అందరం కలిసి కరోనా వైరస్ పై విజయం సాధించాలి. జై హింద్ అని ఆయన ట్వీట్ చేసారు. కాగా ఆయన మరణి౦చడం తో సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన నిర్మాత, దర్శకుడి గా కూడా రాణించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version