బ్రిటన్ ప్రధాన మంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించిన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్ అధికారిక సంప్రదాయాల ప్రకారం రాజు చార్లెస్-3 ఆహ్వానం మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు 10 డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయంలో మాజీ ప్రధాని లిజ్ ట్రస్ తన చివరి కేబినెట్ సమావేశం నిర్వహించారు.
సునాక్ పాలన విజయవంతం కావాలని లిజ్ ట్రస్ ఆకాంక్షించారు. మంచి రోజులు మందున్నాయని అన్నారు. బ్రిటన్ ప్రధానిగా తనకు అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ట్రస్ తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి బకింగ్‌హామ్ ప్యాలస్‌కు వెళ్లిన లిజ్ ట్రస్.. రాజు చార్లెస్-3కి రాజీనామా పత్రం సమర్పించారు.
ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దలేక ప్రస్తుత ప్రధాని లిజ్‌ట్రస్ రాజీనామా ప్రకటించగా అత్యంత వేగంగా నూతన ప్రధాని ఎంపికను కన్జర్వేటివ్ పార్టీ చేపట్టింది. రిషి సునాక్, బోరిస్ జాన్సన్, పెన్నీ మోర్డాంట్‌లు ప్రధాని పదవికి పోటీపడ్డారు. కానీ ముందుగానే బోరిస్ జాన్సన్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి పోటీలో నిలిచేందుకు కన్జర్వేటివ్ పార్టీలో 100 మంది ఎంపీల మద్దతు అవసరం. రిషి సునాక్‌కు 150కిపైగా ఎంపీల మద్దతు లభించింది. మరో నాయకురాలు పెన్నీ మోర్డాంట్ వందమంది ఎంపీల మద్దతు కూడ గట్టలేక పోటీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో బ్రిటిష్ ప్రధానిగా సునాక్‌కు మార్గం సుగమమైంది.
The King received The Rt Hon Rishi Sunak MP at Buckingham Palace today.
His Majesty asked him to form a new Administration. Mr. Sunak accepted His Majesty's offer and was appointed Prime Minister and First Lord of the Treasury. pic.twitter.com/UnT3jMS8so
— The Royal Family (@RoyalFamily) October 25, 2022