దేశంలో పెట్రోల్, డీజిల్ మంట అంటుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. నిన్న కూడా దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. నిన్న ప్రతి లీటర్ పెట్రోల్ పై 95 పైసలు, లీటర్ డీజిల్ పై 81 పైసలు పెరిగాయి. తాజా గా నేడు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. నేడే దేశ వ్యాప్తంగా ప్రతి లీటర్ పెట్రోల్ పై 90 పైసలు పెరిగాయి. అలాగే లీటర్ డీజిల్ పై 87 పైసలు పెరిగింది.
తాజా గా ఈ రోజు పెరిగిన ధరలతో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 110 కు చేరింది. దీంతో లీటర్ డీజిల్ ధర రూ. 96.36 కు చేరింది. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాజా ధరల ప్రకారం లీటర్ పెట్రోల్ ధర రూ. 111.23 కు చేరింది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 97. 28 కి చేరింది. కాగ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల పై పార్లమెంట్ లో విపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్, త్రుణమూల్ కాంగ్రెస్, ఎస్పీ తో పాటు టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ పార్టీల పార్లమెంట్ సభ్యులు ఆందోళన చేశారు.