జనగామ జిల్లా పెంబర్తి జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఆగిఉన్న డీసీఎంను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. డీసీఎం డ్రైవర్, క్లీనర్‌తో పాటు కారులో ఉన్న ఆరేళ్ల పాప మృతి చెందింది. కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. డీసీఎం వాహనం పంక్షర్ కావడంతో టైరు మారుస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు నడుపుతున్న వ్యక్తి నిద్ర మత్తులో ఉండటం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.